నీవు నిష్క్రమించేసమయానికి నా నడినెత్తిమీదికి సూరీడొచ్చి
నాట్యంచేయడం ఆరంభించాడు.
మధ్యందిన మార్తాండుడు గదా ఉగ్రరూపందాల్చి జనం మొహాలనన్నింటినీ
ఎండతీవ్రతతో మాడ్చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
పనంతటినీ పూర్తిచేసుకుని ముదు ప్రాగణంలో విశ్రాతి తీసుకుంటున్నాను నీవు వెళ్ళే సమయానికి .
దూరంగా పంటచేలమీదనుంచి వీచే పైరగాలులు
సుతిమెత్తగా తూర్పారబట్టినప్పుడు ఎగిరిపడుతూ వచ్చే గింజల్లా
విచ్చేసి పరిమళాలను పంచేసి తిరుగుముఖం పట్టి వెళుతున్నాయ్
పావురాళ్ళేమో నీడపట్టుకు చేరుకుని క్లుప్తంగా కూనిరాగాలనందుకుంటున్నాయ్
ఇంతలో తేనెటీగ గబగబా నాగదిలోకిదూరి
పంటపొలాలమీదనుంచి ఏవో తాజా వార్తలను తీరిగ్గా మోసుకొచ్చి అందిస్తున్నది.
మొత్తం గ్రామం గ్రామమంతా ఎండ ధాటికి తట్టుకోలేక
ఇళ్ళలోనే తలదాచుకుని సేదతీరుతున్నాయ్ .
వీధులన్నీ అప్పుడే వూడ్చేసినట్లు నిర్మానుష్యంగా మారిపోయాయి.
మధ్యమధ్యలో అర్ధాంతరంగా ఆకులు గలగలలతో ఆనంద వాహినులై విహరిస్తూ
కాలక్రమేణా సద్దుమణగడం మొదలెట్టాయ్.
ఆకాశంవైపునేను దృష్టినిసారిస్తే నీలిమబ్బులపైన
నాకుపరిచమైన వ్యక్తిపేరు ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది.
అది అందమైన నాదస్తూరీతోనే లిఖించబడ్డదని ఆలస్యంగా గ్రహించాను.
గ్రామం గ్రామమంతా ఎండధాటికి తాళలేక ఇంట్లోనే తలుపులు బిడాయించుకుని సేదతీరుతున్నాయ్.
అయ్యయ్యో !! నాకేశసంపదకు తైల సంస్కారం చేసి దువ్వుకోవడమే మర్చిపోయాను.
పిల్లగాలులు వాటిలోకొన్ని కేశాలను నా చెంపలమీదకు చిలిపిగా నెట్టేసి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయ్.
[రవీంద్రుని తోటమాలి[The Gardener ] 55 వ గీతానికి స్వేచ్చానువాదం ]