37
నాగళసీమను పుష్ప మాలాకృతురాలినిచేసి
గౌరవార్హం చేయడం సబబేనా అని ఒక్కసారి ఆలోచించు!!.
నేను భక్తిపురస్సరంగా అల్లిన ఈ సుమాల మాలలు
యే ఒక్కరికో పరిమితంచేయడం భావ్యం కాదని నా భావన.
నాకళ్ళల్లో అనునిత్యం తారసపడే జీవులెందరున్నారో తెలుసా?
ఇప్పడిదాకా దున్ని సాగుచేయబడని క్షేత్రాల్లో
ఆశావహులై శ్రమకోర్చి స్వేదఫలాననందుకోవాలని తపన పడుతున్న
ఎందరో సాగుబడిదారులు దారులు వెదుక్కుంటూ జీవిస్తున్నారు.
అంతేకాదు భావకవుల ఊహాలోకాల్లో విహరిస్తూన్న
సౌందర్య లలామలెందరో ప్రేమ సాక్షాత్కారంకోసం
ఆవిష్కృత హృదయ వాసులై ఎందరో నిరీ క్షిస్తున్నారు
నీవే జబాబుచెప్పమని నాహృదయాన్ని అడిగేసమయం మించిపోయింది.
అప్పట్లో వికసితంగాని మొగ్గగా పడివున్న నాజీవితం
అంతరాంతరాళాల్లో పరిమళాన్నంతటినీ గుంభనంగానూ భద్రంగానూ దాచుకున్నది.
ఇప్పుడదే తన హృదయ వైశాల్యాన్ని బహుదా విస్తరించి వున్నది.
ఎవ్వరు ఈ ఆనందాన్ని ఊహించి సత్వరం గ్రహించి దాచుకోగలరు?
ఇది ఎప్పుడు అకస్మాత్తుగా అదృశ్యమౌతుందో ఎవ్వరికెరుక?
నాహృదయం యే ఒక్కరికో సమర్పించడానికి పరిమితంకాలేదని
గ్రహించు.
అది ఎందరికో ఆనంద వార్ధిగా సుఖ సంతోషాలను పంచుతుండాలని నా ఆకాంక్ష.
[టాగోర్ తోటమాలి[ఠె గర్దెనెర్ ]37 వ గీతానికి స్వేచ్చానువాదం ]

No comments:
Post a Comment